FlipkartSearch

Tuesday 25 April 2017

శెభాష్… సుల్కాన్ సింగ్… యోగీ-డీజీపీ

37 ఏండ్ల IPS సర్వీస్… సంపాదన 3 గదుల ఇల్లు… 2 ఎకరాల పొలం…!!
ప్చ్… ఎందుకొస్తారండీ… ఖాకీ బట్టలేసుకుని..? 
పేరుకు ఐపీఎస్… 37 ఏండ్ల సర్వీసు… ఏం సంపాదించాడు..? 
ఆఫ్టరాల్… 3 లక్షల విలువ జేసే 2.3 ఎకరాల పొలం… 
లక్నోలో వాయిదాలతో కొనుక్కున్న ఓ మూడు గదుల ఇల్లు… 
అసలు ఇది చెప్పటానికి మాకెంత చిన్నతనం..? 

అసలు ఆయన్ని సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలంటూ ఇతర రాష్ట్రాల డీజీపీలు, తోటి ఐపీఎస్‌లు గోల చేస్తారేమో…!! హోం గార్డులు, కొత్త పోలీసులు కూడా పిచ్చిపిచ్చిగా సంపాదిస్తున్న రోజుల్లో ఒక డీజీపీ కథ ఇదంటే నమ్మగలరా..? కానీ నిజమే… యూపీ కొత్త డీజీపీగా ఎన్నికైన సుల్ఖాన్ సింగ్… అంతే… తన జీతం దాటి… రూపాయి కూడా తీసుకోడు… డై హార్డ్ నిజాయితీపరుడు… అసలు ఈరోజుల్లో అలాంటివాళ్లు కూడా ఉంటారా అని విస్తుపోయేంత నిరాడంబరుడు…

ఉంటే ఉంటారేమో… ఉండొద్దని ఏముంది..? కానీ యూపీలో…? యూపీ అంటేనే నేరస్థులకు భూతలస్వర్గం… పేకాటల దగ్గర్నుంచి ఆయుధాల తయారీ దాకా అక్కడ అనేక మాఫియాలు, గ్యాంగులు, డెన్లు… ఇక పోలీసులకు స్వర్గమున్నర… జస్ట్, చూసీచూడనట్టు ఉంటే చాలు… కట్టలకు కట్టలు… లెక్కపెట్టుకోవడమే జీతం… అలాంటిచోట 37 ఏండ్ల సర్వీసును ఎక్కడా టెంప్ట్ గాకుండా నిజాయితీగా ఉండగలగడం ఈరోజుల్లో మామూలు విషయం కాదు… బలమైన వ్యక్తిత్వం ఉంటే తప్ప సాధ్యం కాదు… నిజానికి ‘భారీ రేట్ల’తో డీజీపీ పదవుల విక్రయాలు జరిగే యూపీ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఐపీఎస్‌ను గుర్తించి, డీజీపీగా నియమించిన యోగీని మెచ్చుకోవాలి… శెభాష్…

1980 కేడర్ ఐపీఎస్ అధికారి ఆయన… 2007లో ములాయంసింగ్ హయాంలో జరిగిన భారీ పోలీసు రిక్రూట్‌మెంట్ స్కాం బయటపెట్టాడు గానీ లేకపోతే ఎప్పుడో డీజీపీ అయ్యేవాడు… ఆ తరువాత మొత్తం నాన్ ఫోకల్ పోస్టుల్లోనే వేశారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా… అఖిలేష్ పీరియడ్‌లోనే, 2012లో ఈ సుల్కాన్ సింగ్‌కన్నా ఎనిమిది మెట్లు కింద ఉన్న జావీద్ అహ్మద్‌ను డీజీపీగా వేశారు… అప్పుడు అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న ఈ సుల్కాన్ సింగ్‌ను తీసుకుపోయి ఓ డీఐజీ ర్యాంకు అధికారిని నియమించే ఓ పోలీసు ట్రెయినింగు కాలేజీలో పడేశారు… 

ఇక కెరీర్ అక్కడే ముగిసిపోయినట్టే అనుకున్న స్థితిలో బీజేపీ అధికారంలోకి రావడం, ఆయన్ని డీజీపీగా ఎంపిక చేయడం ఓ పెద్ద మలుపు… ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు కదూ… ఈయన పదవీకాలం వచ్చే సెప్టెంబరు వరకూ ఉంది…. శెభాష్… శెభాష్… సుల్కాన్ సింగ్… శెల్యూట్…

Sulkhan Singh, has been appointed as the new Director General of Police (DGP) by the Yogi Adityanath.
Please share this inspiring story with others too.

No comments:

Post a Comment